కల్లూరు అర్బన్ 33వ వార్డులోని పాత కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే,
టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఆమె చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.