కల్లూరు: రాయలసీమ నీటి హక్కుల కోసం వైఎస్ఆర్‌సీపీ బహిరంగ సభ

368చూసినవారు
కల్లూరు: రాయలసీమ నీటి హక్కుల కోసం వైఎస్ఆర్‌సీపీ బహిరంగ సభ
వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు. గురువారం కల్లూరులో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, రాయలసీమ ఎత్తిపోతల పథకం, సాగు తాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, సీమ అభివృద్ధిపై చర్చించారు. సీమ ప్రజలకు న్యాయం చేసేందుకు పథకాన్ని పూర్తిచేయాలని ఆయన అన్నారు. ఈ సభలో ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్