కర్నూలు: డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై దృష్టి: కలెక్టర్

1608చూసినవారు
కర్నూలు: డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై దృష్టి: కలెక్టర్
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత గల ఓటర్లు ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా, ద్వంద్వ ఓటర్లను గుర్తించి జాబితాను ప్రక్షాళన చేయాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, అవసరమైన పత్రాలు సేకరించాలని సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డీఆర్‌వో వెంకట నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్