కర్నూలు: ఉర్దూ యూనివర్శిటీ పనులు పునఃప్రారంభించిన మంత్రి భరత్

198చూసినవారు
కర్నూలు: ఉర్దూ యూనివర్శిటీ పనులు పునఃప్రారంభించిన మంత్రి భరత్
కర్నూలు జిల్లా విమానాశ్రయం సమీపంలోని ఓర్వకల్లు వద్ద డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ శుక్రవారం పునఃప్రారంభించారు. యూనివర్శిటీ నిర్మాణానికి తన వంతుగా రూ. 1 కోటి విరాళంగా ప్రకటించారు. గతంలో నిలిచిపోయిన పనులకు మళ్లీ ఊపునిచ్చామని, కర్నూలు జిల్లా అభివృద్ధికి భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, వీసీ షా వలి ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్