కర్నూలు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు నిర్వహించనున్న పోషణ పక్వాడ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ బుధవారం సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్యక్రమాలు నిర్వహించి, ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని మాతృశిశు ఆరోగ్య సేవలు అందించాలని తెలిపారు. రెండేళ్ల లోపు పిల్లల మెదడు అభివృద్ధికి స్క్రీన్ వాడకం తగ్గించి, ప్రాసెస్డ్ ఫుడ్స్ బదులు ఇంటి వంటను ప్రోత్సహించాలని సూచించారు.