కర్నూలు–విజయవాడ ఇంటర్సిటీ రైలు నడపాలి

849చూసినవారు
కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని, రైల్వే వ్యాగన్ వర్క్ షాప్‌ను పూర్తిచేయాలని సీపీఎం పార్టీ అధికారులు కోరారు. బుధవారం కృష్ణానగర్‌లోని పోస్ట్ ఆఫీస్ వద్ద రైల్వే అధికారులకు, రైల్వే మంత్రికి పోస్ట్ కార్డులు పంపారు. సీపీఎం నగర కార్యదర్శి వర్గ సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు జి. ఏ. సు మాట్లాడుతూ, ఇప్పటికే అనేక ఆందోళనలు, దీక్షలు, వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేదని అన్నారు. కర్నూలు-విజయవాడకు రైలు లేకపోవడంతో ప్రజలు 50-70 కిలోమీటర్ల దూరంలోని డోన్, నంద్యాల స్టేషన్లకు వెళ్లి రైలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్