ఓర్వకల్లు: ఈ–క్రాప్ నమోదు పకడ్బందీగా చేయాలి: కలెక్టర్

335చూసినవారు
ఓర్వకల్లు: ఈ–క్రాప్ నమోదు పకడ్బందీగా చేయాలి: కలెక్టర్
రైతుల పంటలకు భద్రత కల్పించే ఈ-క్రాప్ నమోదు ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓర్వకల్లు మండలంలో వరి పంట ఈ-క్రాప్ నమోదును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట బీమా, సబ్సిడీ, నష్టపరిహారం వంటి ప్రయోజనాలకు ఖచ్చితమైన డేటా అవసరమని, రైతులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, ఆర్డీవో సందీప్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్