ఓర్వకల్లు: రైతులకు రూ. 2 కోట్లు డబ్బులు ఎగ్గొట్టిన ఏజెంట్

1618చూసినవారు
ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లి, కాల్వ, హుసేనాపురం, పిన్నాపురం గ్రామాలకు చెందిన సుమారు 100 మంది మొక్కజొన్న రైతులు భారీగా మోసపోయారు. ఆదివారం వారు మాట్లాడుతూ బ్రాహ్మణపల్లికి చెందిన కమిషన్ ఏజెంట్ ఎరుకలీ నాగేశ్వరరావు వద్ద మొక్కజొన్న విక్రయించి, దాదాపు రూ.2 కోట్ల మేరకు డబ్బులు ఇప్పటికీ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతులు వాపోయారు. బాధ్యుల ఖాతాలు ఫ్రీజ్ చేసి, రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్