పాలకొల్లు: మొక్కజొన్న పంట దగ్ధం – రైతుకు భారీ నష్టం

1551చూసినవారు
పాలకొల్లు: మొక్కజొన్న పంట దగ్ధం – రైతుకు భారీ నష్టం
ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు గ్రామంలో బుధవారం మొక్కజొన్న పంట దగ్ధమైంది. రైతు గోపాలరెడ్డి సాగు చేసిన 5 ఎకరాల పంటలో సుమారు 3 ఎకరాలు అగ్నిలో కాలిబూడిదైంది. ఈ ఘటనలో రైతుకు దాదాపు 3 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా లేక ఎవరైనా నిప్పు పెట్టారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్