పాణ్యం: అడ్వాన్స్ ఇవ్వలేదని రైతుపై కోడవలితో దాడి

1633చూసినవారు
పాణ్యం: అడ్వాన్స్ ఇవ్వలేదని రైతుపై కోడవలితో దాడి
పాణ్యం మండలంలో రైతు నజీర్ అహ్మద్‌పై అడ్వాన్స్ ఇవ్వలేదనే కారణంతో తోట లక్ష్మయ్య అనే వ్యక్తి కోడవలితో దాడి చేశాడు. బుధవారం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, తమ్మరాజుపల్లెలో 4 ఎకరాల మామిడి తోటలో సాగు చేస్తున్న నజీర్‌ను, తోట లక్ష్మయ్య, అతని భార్య, అత్త కలిసి పని చేస్తామని అడిగారు. ఖర్చులకు అడ్వాన్స్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన లక్ష్మయ్య, నజీర్ తల, మెడ, చెంపపై కోడవలితో గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన నజీర్‌ను జీజీహెచ్‌కు తరలించి, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్