కర్నూలు పట్టణంలోని మాధవి నగర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్బంగా పాణ్యం నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను అక్కడికక్కడే సమస్యలని పరిష్కరించారు. అనంతరం మరికొన్ని సమస్యలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేయాలని, ప్రజల సమస్యలపై అలసత్వం చేయరాదనీ సంబంధిత అధికారులను ఆదేశించారు.