పాణ్యం: అదుపుతప్పి ఆయిల్ ట్యాంకర్ బోల్తా

554చూసినవారు
పాణ్యం: అదుపుతప్పి ఆయిల్ ట్యాంకర్ బోల్తా
పాణ్యం మండలంలోని తమ్మరాజుపల్లె ఘాట్ సెక్షన్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు నంద్యాల టూ కర్నూలు జాతీయ రహదారిలో వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు ఇరువైపుల ఉండే రైలింగ్‌ను ఢీకొని లోయలోకి బోల్తా పడింది. కాగా ట్యాంకర్ డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ కు గాయాలయ్యాయని చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్