కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తున్నారని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, పోలీసులు
టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలను ప్రభుత్వం మానుకోవాలని, అక్రమ కేసులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, వాటికి భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.