పాణ్యం: ఘాట్ రోడ్డులో టైర్ పేలి లారీ బోల్తా: డ్రైవర్ మృతి

866చూసినవారు
పాణ్యం: ఘాట్ రోడ్డులో టైర్ పేలి లారీ బోల్తా: డ్రైవర్ మృతి
మంగళవారం పాణ్యం మండలంలోని తమ్మరాజుపల్లె–సిమెంటు నగర్ ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. బేతంచెర్ల నుంచి నంద్యాలకు ఎర్రమట్టి లోడుతో వస్తున్న లారీ ముందుటైరు పేలడంతో వాహనం అదుపుతప్పి కొండపై నుంచి కిందపడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రైవర్ సల్మాన్ (26) తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై హైవే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్