సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి.. ఎస్సై నాగార్జున

1316చూసినవారు
ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను ఎస్సై నాగార్జున గురువారం సందర్శించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన విద్యార్థినులకు బాల్య వివాహాలు, పోక్సో కేసులు, సైబర్ మోసాలు, మైనర్ల డ్రైవింగ్, హెల్మెట్ ధరించడం, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలను అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. సోషల్ మీడియా వాడకంలో, ఆన్‌లైన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై నాగార్జున సూచించారు.