పాణ్యం చెంచు కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్

1633చూసినవారు
పాణ్యం చెంచు కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఆపరేషన్
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, పాణ్యం సబ్ డివిజన్ ఎఎస్పి సుస్మిత ఐపీఎస్ సూచనలతో పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పాణ్యం చెంచు కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లను తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలు, నిషేధిత వస్తువులపై పోలీసులు సోదాలు చేశారు. సర్సిల్ పరిధిలోని గ్రామాల్లో నేరాలకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పాణ్యం సిఐ తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్