శకునాల: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 50 మంది యువకులు

291చూసినవారు
శకునాల: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 50 మంది యువకులు
ఆదివారం, ఓర్వకల్లు మండలం శకునాల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బాల వీరరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకట రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల అధ్యక్షుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, గ్రామ నాయకులు మౌళిశ్వర రెడ్డి, హరి, ఘనశ్యాం సుందర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్