పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని బిలకలగూడూరు గ్రామంలో నంద్యాల ఎంపీ శబరి మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నీటి కొరత ఉందని, నాలుగు బోర్లు మంజూరు చేసి నీటి ఎద్దడిని తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు రఫిక్, గ్రామ టిడిపి,
జనసేన నాయకులు పాల్గొన్నారు. నీటి ఎద్దడిని నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎంపీ సూచించారు.