పాణ్యం జురాగు కాలువలో గుర్తు తెలియని మృతదేహం

3450చూసినవారు
పాణ్యం జురాగు కాలువలో గుర్తు తెలియని మృతదేహం
పాణ్యం గ్రామంలోని జురాగు కాలువలో శనివారం గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యమైందని పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుడికి(40–45)సం. లు ఉంటాయని, అతని ఎడమ చేతిపై “గంగ” “సంగీత” అనే అక్షరాలు కన్నడ లిపితో రాసిన ట్యాటూలు ఉన్నాయని అన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 18 వతేదీన మధ్యాహ్నం 1 గంటకు పాణ్యం టౌన్‌కు చెందిన బైక్ స్పేర్ పార్ట్స్ యజమాని రాజశేఖర్ వద్దకు వెళ్లి మాట్లాడుతూ తనది “గద్వాల్” గ్రామమని చెప్పినట్లు సమాచారం. వ్యక్తి ఆచూకీ తెలిస్తే పాణ్యం ఎస్ఐ 9121101096, సీఐ 9121101095 సమాచారం అందించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్