స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి

19చూసినవారు
స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి
కర్నూలు పట్టణం మాధవి నగర్ లోని పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి క్యాంపు కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గౌరు వెంకట రెడ్డి, యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డిల సమక్షంలో ఓర్వకల్లు మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నాయకులతో విస్తృతంగా చర్చించారు. అనంతరం పార్టీని మరింత బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగడం, ఎన్నికలకు పటిష్టంగా సిద్ధం కావాల్సిన అంశాలపై సమీక్షించారు

సంబంధిత పోస్ట్