నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఓర్వకల్ మండలం శకునాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్త విద్యార్థుల ప్రవేశాలతో మొదటి రోజు పాఠశాల సందడిగా మారింది. పాత, కొత్త
విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయురాలు కమతం సునీత విద్యార్థులకు స్వాగతం పలికి, గత ఏడాది పదవ తరగతి ఫలితాల సంతృప్తిని పంచుకున్నారు. ఈ ఏడాది
విద్యార్థులు మరింత మెరుగైన
ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కర్నూలు, పాణ్యం ప్రాంతాల్లో ఈ సందడి కనిపించింది.