నంద్యాల నుండి గడివేముల గ్రామానికి శుక్రవారం రాత్రి తిరిగి వస్తుండగా పోలూరు గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 20 ఏళ్ల మన్సూర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు, బంధువులు అతన్ని శాంతిరాం హాస్పిటల్ లో చేర్పించగా, చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. గడివేముల గ్రామానికి చెందిన గౌండ బాబు వలి, ఫాతిమాబీ దంపతుల కుమారుడే మన్సూర్ అని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు.