
ఓర్వకల్లు: భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
ఓర్వకల్ మండలంలోని ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన రైతుల బోరుబావులకు ప్రతిపాదించిన రూ. 20 వేల నుండి రూ. 1. 20 లక్షల నష్టపరిహారం అన్యాయమని భూ నిర్వాసితుల కమిటీ నాయకుడు బి. నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ప్రతి బోరుబావుకూ కనీసం రూ. 4 లక్షలు, ఇంకా నష్టపరిహారం రాని రైతులకు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేముల గ్రామ రైతులతో కలిసి ఆర్డీవో సందీప్ కుమార్కు వినతిపత్రం అందజేయగా, ఆర్డీవో విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.






































