
కౌలూరు: కోర్టు సముదాయం స్థలానికి ఆర్డీవో పరిశీలన
నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్ గురువారం పాణ్యం నియోజకవర్గంలోని కౌలూరు పరిధిలో సర్వే నెం. 126లో ప్రతిపాదిత జిల్లా కోర్టు సముదాయ స్థలాన్ని పరిశీలించారు. కోర్టు నిర్మాణానికి అవసరమైన 10.7 ఎకరాల స్థల వివరాల నివేదికలు వెంటనే సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని ఆయన తహసీల్దారు నరేంద్రనాథ్ రెడ్డికి ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్ఐ రామచంద్రారావు, సర్వేయర్ ఆనంద్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.







































