
శక్తి యాప్ తో మహిళలకు పూర్తి రక్షణ: పోలీసుల భరోసా
కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్ గురువారం ఓర్వకల్ మండలం శకునాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏపీ పోలీసుల శక్తి యాప్ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ అందుతున్నట్లు వివరించారు. విద్యార్థులకు చట్టాల అవగాహన, శక్తి యాప్ డౌన్లోడ్, మోటార్ సైకిల్, సైబర్ నేరాలు, బాల్యవివాహాలపై సూచనలు ఇచ్చారు.






































