
కడుపునొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య
తుగ్గలి మండలంలోని దిగువ చింతల కొండ గ్రామంలో కోనేటి శివ (23) అనే యువకుడు కడుపునొప్పి తగ్గకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకున్నా నొప్పి తగ్గలేదు. తండ్రి జగదీశ్వరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.







































