పనిచేయని యాప్‌తో అంగన్వాడీల ఆందోళన: అధికారుల నోటీసులపై నిరసన

492చూసినవారు
పత్తికొండ పట్టణంలో పనిచేయని 'బాబా యాప్' వల్ల ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీలు మంగళవారం ఐసిడిఎస్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకు సరిపోని బడ్జెట్ విడుదల చేసిందని, పనిచేయని యాప్‌ల వల్ల అంగన్వాడీలు కష్టాలు పడుతున్నారని అంగన్వాడి వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు చిట్టెమ్మ, సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్, కారప్ప, సావిత్రి, జయప్రకాశ్ రెడ్డితో పాటు పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు. అధికారులు నోటీసులు ఇవ్వడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్