పత్తికొండ పట్టణంలోని స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ సిఐటియు అనుబంధ సంఘం వర్కర్ అండ్ హెల్పర్ యూనియన్ మంగళవారం ధర్నా చేపట్టింది. ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టెమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, అధ్యక్షులు గోపాల్, అంగన్వాడీ మండల కార్యదర్శి సావిత్రి, నాయకులు రాజుల కారప్ప, జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర మాట్లాడుతూ, అబ వెంటనే తొలగించాలని, అధికారులు వేధింపులు ఆపాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.