అటికెలగుండు: కబడ్డీ ఆడుతూ యువకుడు మృతి

1274చూసినవారు
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం అటికెలగుండులో శుక్రవారం శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జరిగిన కబడ్డీ పోటీలలో వంశీ (20) అనే యువకుడు ఆడుతుండగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించేలోపే మరణం సంభవించింది. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా మారాయి.

సంబంధిత పోస్ట్