బొందిమడుగుల: రమేష్ పాడే మోసిన జైభీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు

547చూసినవారు
బొందిమడుగుల: రమేష్ పాడే మోసిన జైభీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు
పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం బొందిమడుగులలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ హత్యపై జైభీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం బొందిమడుగులలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ హత్య జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహంపై పూలమాలలు ఉంచి జోహార్లతో నిరసనలు చేశారు. ప్రభుత్వం రమేష్ కుటుంబానికి అండగా నిలవాలని, హత్యకేసులో కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నేతలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్