దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సీఐటీయూ

98చూసినవారు
పత్తికొండ పట్టణంలోని స్థానిక ముక్కెల్లా మారెళ్ళ పెండికల్ స్టేషన్ ఆటో స్టాండ్ దగ్గర ఆటో కార్మికులతో సీఐటీయూ మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసి, 29 చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ల వల్ల సంఘటిత, అసంఘటిత కార్మికులకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. జనవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆటో కార్మికులు శివ, శీను, శ్రీధర్, అంజి, రఘు, రంగా, జయప్రకాష్, అక్బర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్