కార్మికులు, కర్షకుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

492చూసినవారు
కార్మికులు, కర్షకుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపు
ఫిబ్రవరి 12న జరగనున్న కార్మికులు, కర్షకుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పత్తికొండ మండల సిఐటియు కార్యదర్శి ఎం. రవిచంద్ర పిలుపునిచ్చారు. పత్తికొండ మండలం హోసూరు గ్రామంలోని వేర్ హౌస్ గోడౌన్ లో హమాలీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లేబర్ కోడ్లు, ఉపాధి హామీ చట్టం, అంగన్వాడి, విద్యుత్, కనీస వేతనం వంటి అంశాలపై చేపట్టిన సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి మేస్త్రి రామాంజనేయులు అధ్యక్షత వహించారు. సుంకన్న, నాగేంద్ర, వంశీ, టి. సహదేవుడు, ఎం. రాజు, హుసేని, మధు, మద్దిలేటి, వై. రమేష్, అమాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్