కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో స్థానిక పంచాయతీరాజ్ కార్యాలయం సమీపంలో ఆటో కార్మికుల అడ్డ వద్ద, కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం సభ్యులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆటో కార్మికులు శివ, శీను, శ్రీధర్, అంజి, రఘు, రంగా, జయప్రకాష్, అక్బర్, రంగస్వామి పాల్గొన్నారు.