మంగళవారం పత్తికొండ పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, 2005లో వామపక్షాల ఉద్యమాలతో వచ్చిన గ్రామీణ ఉపాధి చట్టం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించి, జి.రాంజీ పేరును పెట్టి స్కీమ్‌గా మార్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బుజ్జులు అధ్యక్షత వహించారు.