కర్నూలు: ఐదు రోజుల్లో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి

2871చూసినవారు
కర్నూలు: ఐదు రోజుల్లో ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులను ఖచ్చితంగా పాటించాలని, ప్రతిరోజూ కనీసం 10 శాతం పురోగతి సాధించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించి, పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్