మద్దికేర: ట్రెయినీ ఎక్సైజ్ ఎస్సైలకు కల్లు విధానాలపై శిక్షణ

508చూసినవారు
కర్నూలు డిపిఈఓ మచ్చా సుధీర్ బాబు మద్దికేర మండలంలోని సుబ్బరాయనపల్లె ఈత వనంలో మంగళవారం కర్నూలు జిల్లాకు కేటాయించిన ట్రెయినీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లకు కల్లు దుకాణాల లైసెన్సుల మంజూరు, కల్లు సేకరణ మరియు పరిపాలనా విధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో లైసెన్సుల రకాలు, చెట్ల కేటాయింపు, కల్లును సేకరించడం, లైసెన్సులు జారీ చేయడం, రీన్యువల్ విధానం, కల్తీ కల్లును గుర్తించడం, అరికట్టే విధానాలు వంటి అంశాలను వివరించారు. అభ్యర్థులు ఈత వనంలో చెట్లు గీయడం, లైసెన్సుదారుల చేత ఆచరణాత్మక ప్రదర్శన ద్వారా అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో ఏఈఎస్ రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్