పత్తికొండలో ఎన్‌టీఆర్ సుజల స్రవంతి వాటర్ యూనిట్ ప్రారంభం

540చూసినవారు
పత్తికొండలో ఎన్‌టీఆర్ సుజల స్రవంతి వాటర్ యూనిట్ ప్రారంభం
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంకుమార్ సోమవారం ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ యూనిట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా స్థానిక ప్రజలకు తక్కువ ధరలో శుద్ధమైన, నాణ్యమైన తాగునీరు అందించడం ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఈ కార్యక్రమం కీలక పాత్ర వహిస్తుందని, ఇది పేదలతో పాటు సమస్త ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్