పత్తికొండ: బీటెక్ విద్యార్థిని మిస్సింగ్

1037చూసినవారు
పత్తికొండ: బీటెక్ విద్యార్థిని మిస్సింగ్
అనంతపురంలో కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన యువతి ఉప్పర కోమలత అదృశ్యం అయ్యింది. గత డిసెంబర్ 28న అనంతపురం టౌన్ సాయినగర్లోని లో ఒక హాస్టల్ నుంచి వెళ్లి ఆమె తిరిగిరాలేదని శుక్రవారం అనంతపురం 2 టౌన్ పోలీసులు తెలిపారు. అనంతలక్ష్మి కాలేజ్ కి వెళ్తానని చెప్పి తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 944079680, 9346917119 సమాచారం ఇవ్వగలరు.

సంబంధిత పోస్ట్