పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మంగళవారం పార్టీ నేతలతో కలిసి పత్తికొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కూటమి నేతల అరాచకాలను అదుపు చేయాలని, కల్తీ నెయ్యి అంశంపై సిట్ చార్జీషీట్లోని వాస్తవాలకు విరుద్ధంగా అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె హెచ్చరించారు.