పత్తికొండ: డిగ్రీ వరకు కష్టపడి చదవాలి: కలెక్టర్ సిరి

244చూసినవారు
పత్తికొండ: డిగ్రీ వరకు కష్టపడి చదవాలి: కలెక్టర్ సిరి
కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి బుధవారం పత్తికొండలోని బీసీ సంక్షేమ బాలికల వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు డిగ్రీ వరకు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. భోజనం, వసతి, మరుగుదొడ్ల సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ చదువు మానకూడదని తెలిపారు. వంటగదిని పరిశీలించి భోజనం రుచిగా ఉందని పేర్కొన్నారు. కాంపౌండ్‌వాల్ ప్యాచ్‌వర్క్‌లు 10 రోజుల్లో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :