పత్తికొండ: రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

1579చూసినవారు
పత్తికొండ: రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
కర్నూలు జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డీఐజీ డా. కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్