ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమై ప్రజలను మోసం చేసిందని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ విమర్శించారు. శుక్రవారం పత్తికొండలో నిర్వహించిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ, సభలో ఆమె మాట్లాడుతూ, ఎన్నికల హామీలను అమలు చేస్తూ సంక్షేమ పాలన అందించిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటి అమలుపై చిత్తశుద్ధి చూపలేదని, మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలను నిరాశపరిచిందని ఆరోపించారు.