పత్తికొండ నియోజకవర్గంలో, ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో రూ. 20.62 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 32 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కష్టసమయంలో అండగా నిలుస్తుందని తెలిపారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మరియు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్‌కి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.