పుల్లగుమ్మి: టీడీపీ నేత మృతికి ఎమ్మెల్యే కోట్ల నివాళి

311చూసినవారు
పుల్లగుమ్మి: టీడీపీ నేత మృతికి ఎమ్మెల్యే కోట్ల నివాళి
వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాగేశ్వర్ రెడ్డి శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి, నాగేశ్వర్ రెడ్డి నివాసానికి చేరుకుని, మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం కలగాలని, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్