రాతన: అన్ని చెరువులకు హంద్రీనీవా నీరు అందిస్తాం: శ్యాంబాబు

891చూసినవారు
రాతన: అన్ని చెరువులకు హంద్రీనీవా నీరు అందిస్తాం: శ్యాంబాబు
కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. మంగళవారం తుగ్గలి మండలంలోని రాతన చెరువును ఆయన పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారని, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేసి నియోజకవర్గంలో మూడు పంటలకు నీరు అందిస్తామన్నారు. ప్రభుత్వ అభివృద్ధిని తట్టుకోలేక వైసీపీ నాయకులు అలజడులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్