తుగ్గలిలో ప్యాసింజర్ రైలు ఆపాలని రైల్వే జీఎం కు విన్నపం

1119చూసినవారు
తుగ్గలిలో ప్యాసింజర్ రైలు ఆపాలని రైల్వే జీఎం కు విన్నపం
గుంతకల్–మార్కాపురం ప్యాసింజర్ రైలును తుగ్గలి రైల్వే స్టేషన్‌లో ఆపాలని బీజేపీ నేత నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు రైల్వే అధికారులను కోరారు. శనివారం గుంతకల్లులో విశాఖపట్నం రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాతూర్‌కు వినతిపత్రం అందజేశారు. తుగ్గలి మండల కేంద్రం కావడంతో విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం ప్రజలు రైల్వేపై ఆధారపడుతున్నారని, రైలు నిలుపుదల లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇచ్చినట్లు నవీన్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్