రవాణా కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

250చూసినవారు
రవాణా కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపు
కర్నూలు పట్టణంలోని కార్మిక కర్షక భవనంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా రవాణా కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ఆర్టీసీ మాజీ నాయకులు దివాకర్ అధ్యక్షత వహించగా, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, ఆటో యూనియన్ రాష్ట్ర నాయకులు కే ప్రభాకర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక సంఘం అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్క్రాప్ కింద వేయాలని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సిఐటియు, AIRTWF సంఘాలు పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నగేష్, మాలిక్, భాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్