కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగులలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టి. ఎం. రమేష్ హత్య ఘటనపై దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుంగ సంజయ్ మాదిగ ఆధ్వర్యంలో నాయకులు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతిపత్రం సమర్పించారు. రమేష్‌పై రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటనను ఆమె దృష్టికి తీసుకెళ్లారు.