తుగ్గలి: బంగారు వెలికితీస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

999చూసినవారు
తుగ్గలి: బంగారు వెలికితీస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
తుగ్గలి మండలంలోని జొన్నగిరి, బొల్లవానిపల్లె, పగిడిరాయి గ్రామాల్లో గోల్డ్ మైనింగ్ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ, మైనింగ్ కార్యకలాపాలు స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని మంగళవారం రాష్ట్ర కార్యదర్శి గీత మాధురి, బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తకాపు హేమసుందర్ రెడ్డి ముందుకు వచ్చిన రైతులతో కలిసి మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ గుప్తా కు వినతిపత్రం అందజేశారు. బంగారం శుద్ధి కోసం ఉపయోగిస్తున్న ప్రాణాంతక రసాయనాలు భూగర్భజలాలు, వాయు కాలుష్యాన్ని కలిగిస్తూ, పంటలు, పళ్ళ తోటలకు క్షతిసాధన చేస్తూ ఉన్నాయి. క్యాన్సర్, కిడ్నీ, ఇతర తీవ్రమైన వ్యాధులు విజృంభిస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్