కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శుక్రవారం తుగ్గలి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, బోధన, మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యా ప్రగతి, భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, బాల్య వివాహాలు బాలికల విద్యకు ఆటంకమని, అలాంటి ఘటనలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.